బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||1||
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||2||
సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం||3||
కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం||4||
కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం||5||
దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం||6||
అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం||7||
సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం||8||
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
లింగాష్టకం యొక్క అర్థం తెలుగు లో
ఈ లింగాష్టకన్ని ఆదిశంకరాచార్య వారు రాశారు, మనం ఈ అష్టకం యొక్క అర్థం తెలుసుకొనే ప్రయాతనమ్ చేద్దాం.
బ్రహ్మ ,విష్ణు మరియు దేవతలచే పూజింపబడేది, స్వచమైన మాటలతో వెలుగునొందింది,
మనకు జన్మజన్మ వల్ల వచ్చే దుఃఖాలను నాశనం చేసేది, దేవతెలు మునులు మరియు ఋషుల చే పూజించ బడేది, కామాన్నికాల్చి చేసి, కరుణను చూపేది, రావణాసురుని గర్వాన్ని అణచినది,
సర్వ సుగంధలచే చక్కగా లేపనం చేసినది, మన బుద్ధివికాసానికి కారణమైనది,
సిద్దులు, దేవతలు మరియు రాక్షసులచే కీర్తింపబడేది, కనకం తో మణులతో అలంకరింపబడే,
నాగులతో అలంకరింపబడేది, దక్షకుడి యజ్ఞాన్ని నాశనం చేసినది,
కుంకుమ మరియు గంధములచే లేపనము చేయబడినది, కాలువల హారంలచే శోభించబడేది,
జన్మజన్మ ల నుంచి సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసేది, దేవతలు మరియు వారి గణాల చేత సేవించబడేది, భక్తి భావంతో పూజింపబడేది , ఎనమిది రకాల ఆకులపై ఉన్నది
లోకం లో అన్ని సరిగ్గా ఉద్బవించాడని కారణమైనది,
అష్ట దారిద్య్రాలను నాశనం చేసిది,
దేవతల గురువు మరియు దేవతలు చే పూజింపబడేది,
దేవతల తోటల్లోని పుష్పాలచే పూజింపబడే లింగం
నీ సన్నిధియే ఒక స్వర్గం లింగమా
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[8]
లింగాష్టకాన్ని శివుడి సన్నిధిలో చదివితే పుణ్యం వొస్తుంది
శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమవడానికి మార్గం దొరుకుతుంది